ఖాతాదారులతో కలిసి ఓగోల్డ్ అప్రైజర్ ఎస్‌బీఐ బ్యాంకునే బురిడీ కొట్టించాడు. ఏపీలోని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఖాతాదారులతో కలిసి చంద్రమోహన్ అనే గోల్డ్ అప్రైజర్ ఆభరణాలను తనఖా పెట్టించి రూ.3.17 కోట్ల రుణాలు ఇప్పించాడు. కొద్దిరోజులకు అవి నాణ్యతలేని బంగారు ఆభరణాలు అని తేలడంతో రీజనల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.