కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపుర సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోయినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. మృతులంతా కర్ణాటకలోని తుమకూరు జిల్లా తిప్పటూరు వద్ద ఉన్న గుంగరహల్లికి చెందినవారు అని పోలీసులు తెలిపారు. మైసూరులో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా వారి కారు ప్రమాదానికి గురైందని వివరించారు.