కూతురుతో పురుగుల మందు తాగించిన ఘటన కేరళలోని ఎర్నాకులంలో చోటుచేసుకుంది. కూతురు ప్రియుడుతో ఫోన్ మాట్లాడుతుందని తండ్రి ఫోన్ స్వాధీనం చేసుకొని హెచ్చరించాడు. కూతురు మారకపోవడంతో తండ్రి రాడ్తో తీవ్రంగా కొట్టాడు. ఆ తరువాత పురుగుమందు బాటిల్ ఆమె ముందు పెట్టి తాగుతావా? లేదా మీరు నన్ను తాగమంటావా ? అని బెదిరించాడు. చివరకు కూతురు పురుగుల మందు తాగి మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.