టిడిపి చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంపై విస్తృత ప్రచారం ప్రారంభించామని విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35వవార్డుటీడీపీ అధ్యక్షుడు రామురెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామురెడ్డి మాట్లాడుతూ వార్డులో ఇంటింటికి తిరుగుతూ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ప్రజల భవిష్యత్తుకు ఏ విధంగా గ్యారెంటీ ఇస్తారనేదితెలియజేస్తున్నామని చెప్పారు.