తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. బుధవారం వాకలపూడి గ్రామంలో ఆర్యవైశ్య సామాజిక సంక్షేమ భవన నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేసారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా వాకలపూడిలో ఆర్యవైశ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.