స్నేహితుడి ఇంటికి వెళ్లివస్తా నని చెప్పి, ఒక యువకుడు అదృశ్యమయ్యాడు. బుధవారం కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐటిఐ జంక్షన్ నివాసం ఉంటున్న జి తేజ (17) కొత్తవలస వద్ద ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇటీవలే ఇంటికి వచ్చి, తిరిగి వెళ్లేందుకు సామగ్రిని సర్దుకున్నాడు. ఆపై స్నేహితుడి ఇంటికి వెళ్లొస్తానని చెప్పి బయటకు వెళ్లిన తేజ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.