జీవీఎంసీ 50వ వార్డు మాధవధార ప్రధాన రహదారిలో మంగళ వారం ఒక మటన్ దుకాణంలో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. గొర్రె తలను కాల్చుతుండగా, ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు బయటకు వ్యాపించడంతో నిర్వాహకుడు పరుగులు తీశాడు. సిలిండర్ గ్యాస్ ఉన్నంత వరకు మంటలు రేగి ఆగి పోయాయి. గ్యాస్ తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.