ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం నుండి అన్ని విధాలా జిల్లాని ఆదుకున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 08, 2023, 01:48 PM

వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర  పల్నాడు జిల్లా వినుకొండలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ...  వినుకొండకు జగనన్న ఇచ్చిన హామీ వరికపూడిశెల. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాం. బొల్లాపల్లిలో తాగు, సాగునీరిస్తామని మాట ఇచ్చారు. కేంద్రం నుంచి అటవీ సంబంధ అనుమతులు సాధించాం.  అన్ని అనుమతులతో వరికపూడిశెల ప్రాజెక్టును నవంబర్‌ 17న సీఎం జగనన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారు, పనులు ప్రారంభిస్తాం.  వినుకొండకు 100 పడకల ఆస్పత్రి తెచ్చుకున్నాం.  ఇంటింటికీ కొళాయి కనెక్షన్లు, రైల్వే అండర్‌ బ్రిడ్జి, నరసరావుపేట–గుంటూరు హైవేను శాంక్షన్‌ చేయించుకున్నాం.  పొలాలకు వెళ్లే దారులు 100 కిలోమీటర్లు వేయించుకున్నాం.  ఇదివరకు ఇవన్నీ చేయలేదు. వినుకొండ అభివృద్ధి గురించి ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుందాం. టీడీపీకి దమ్ముంటే రమ్మనండి అని సవాల్ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com