రాజకీయ కక్షసాధింపుతోనే చంద్రబాబు జైలు పాలయ్యాడని చెప్పుకోవడం సరైంది కాదు. ఇదే స్కిల్స్కామ్కు సంబంధించి ఈడీ కొందర్ని ఇప్పటికే అరెస్టు చేసింది. ఐటీ శాఖ సైతం రూ.118కోట్లకు లెక్కలు చెప్పాలని చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది కదా..? అని మంత్రి జోగి రమేష్ అన్నారు. సీఐడీకి జగన్ గారు బాధ్యులైతే...మరి, ఈడీ, ఐటీ సంస్థలకు మీ పెద్దమ్మ బాధ్యురాలా? బహుశా..మీ పెద్దమ్మ చంద్రబాబు మీద చాలా కసితో ఉండి ఆమెనే నీ తండ్రిని జైల్లోకి తోయించి, బెయిల్ రాకుండా చేస్తుందేమోననే అనుమానం ఉంది. దీనిపై కూడా లోకేశ్ మాట్లాడితే బాగుంటుంది అని అనుమానం వ్యక్తపరిచారు.