ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు అన్ని సామాజిక వర్గాలను మోసం చేసాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 08, 2023, 01:53 PM

వైయ‌స్ఆర్‌సీపీని ఆదరించేందుకు ఏపీ ప్రజలు మరోసారి సిద్ధం అవుతున్నారని, వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే అన్నివర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని వైసీపీ నేత  నారాయ‌ణస్వామి అన్నారు. ఆళ్లగడ్డలో వైయ‌స్ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర  కార్యక్రమంలో భాగంగా అయన మాట్లాడుతూ.... గత ప్రభుత్వంలో చంద్రబాబు అన్ని సామాజిక వర్గాలను మోసం చేయడమే కాకుండా.. అబద్ధపు వాగ్దానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశార‌ని  అన్నారు. కానీ, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అభివృద్ధి చెందడం మాత్రమే కాదు.. అన్ని సామాజిక వర్గాలు బాగుపడ్డాయి. ఇలా అన్నిరకాలుగా రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి. అంతేకాదు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 50 శాతం రిజర్వేషన్లతో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నారని  గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం కాబట్టే ప్రజల్లోకి సామాజిక సాధికార యాత్ర ద్వారా ధైర్యంగా వెళ్లగల్గుతున్నామని, కానీ, చంద్రబాబు మాత్రం ఎన్నికల సమయంలో మరోసారి ప్రజల్ని మభ్యపెట్టేందుకు మాయమాటలు చెబుతున్నారని, ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com