నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సామాజిక సాధికారయాత్ర దిగ్విజయంగా సాగింది. వర్షం కురుస్తున్నా లెక్కచెయ్యకుండా ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. జన ప్రభంజనంతో సభా స్థలి సంద్రాన్ని తలపించింది. స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన సామాజిక సాధికారక యాత్రలో డిప్యూటీ సీఎంలు అజాంద్ బాషా, నారాయణస్వామి, మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎంపీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.