పౌరుల జీవన ప్రమాణాల పెంపే ధ్యేయం అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకూర్మంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 25 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం టైప్ - 2 భవనం ప్రారంభించారు. నాడు - నేడు ప్రణాళికలో భాగంగా పొందర వీధి లో,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 16 లక్షల రూపాయలతో నిర్మించిన భవనం ప్రారంభించి, నిర్వాహకులకు శుభాకాంక్ష లు అందించారు. అలానే ఇక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సంబంధించి 51 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించి సంబంధిత వర్గాలకు అభినందనలు తెలిపారు.