గాజాలో మృతుల సంఖ్య 10,569కి చేరింది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ సైన్యం చేతిలో 214 మంది మరణించారు. మరోవైపు కరెంటు లేక క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స అందడం లేదు. ఈ క్రమంలో హమాస్ పై యుద్ధం ముగిసిన తర్వాత గాజా రక్షణ బాధ్యతను తాము తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తీవ్రంగా స్పందించిన అమెరికా ఎలాంటి ఆక్రమణలు చేయకూడదని పేర్కొంది.