మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా కొత్వాలి పోలీసులు ఓ ఎలుకను అరెస్ట్ చేశారు. ఇటీవల పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తోన్న 60 మద్యం సీసాలను సీజ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. అయితే సీజ్ చేసిన మద్యం సీసాలు ఉన్నట్టుండి మాయమయ్యాయి. దీనికి గల కారణమేంటని కోర్టు అడిగినప్పుడు.. మద్యం సీసాలను ఎలుకలు ధ్వంసం చేసి తాగేశాయని, ఓ ఎలుకను బంధించామన్నారు. మిగిలిన ఎలుకలు పరారయ్యాయని కోర్టుకు తెలిపారు.