విద్యార్థిగా ఉన్న సమయంలో ఓ టీచర్ తనతో శారీరకంగా కలిసిందని ఓ యువకుడు ఆరోపణ చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి సదరు ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. అమెరికాలోని మాంట్గోమెరి విలేజ్ మిడిల్ స్కూల్లో మెలిసా మేరి కర్టిస్ ఉపాధ్యాయురాలిగా పని చేసేది. అదే స్కూల్లో చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థితో బలవంతంగా శారీరకంగా కలిసింది. విద్యార్థికి మద్యం, గంజాయి తాగించి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడింది.