చేబ్రోలు మండలంలోని గొడవర్రు గ్రామం ప్రధాన రహదారి బుధవారం కురిసిన వర్షానికి జలమయమైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారి లోతట్టుగా ఉండటంతో కొద్దిపాటి వర్షానికే మునిగిపోతుంది. దశాబ్ద కాలంగా ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని అధికారులకు అర్జీలు అందించిన ఫలితం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రహదారి నుంచి వెళ్లే రైతులు వర్షాకాలం ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.