'జాతీయ న్యాయ సేవా దినోత్సవం' సందర్భంగా రాజాం పట్టణంలోని స్థానిక వేదగాయత్రి జూనియర్ కళాశాల, రంగుముద్రి డిగ్రీ కళాశాలల్లో గురువారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ సివిల్ జడ్జి ఎం. బాబు న్యాయ సేవల లభ్యత, ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలి, అర్హత ప్రమాణాలు, ఇతర న్యాయ సేవల కార్యకలాపాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశ చాలా కీలకమైనదని అన్నారు.