వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర లో భాగంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఇక్కడకు వచ్చిన జనాలను చూస్తుంటే...జనసంద్రాన్ని తలపిస్తున్నారు. ఇదంతా జగనన్న ఘనతే. అంబేద్కర్, జ్యోతిరావుఫూలే, మౌలానా అబుల్ కలామ్ అజాద్లాంటి మహానుభావులు సామాజిక సాధికారత గురించి ఆలోచించారు. వారి ఆశయాల బాటను ఎంచుకున్న జగన్మోహన్రెడ్డి సామాజిక విప్లవాన్నే తీసుకొచ్చారు. అనేక అవమానాలు, కష్టాలు చూసిన వెనుకబడ్డ వర్గాల ప్రజలమైన మనకు మంచి రోజులు వచ్చాయంటే దానికి ప్రధాన కారణం జగనన్న. ఈ రోజు పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరగాలని ఆలోచించే నాయకుడు జగనన్న రూపంలో వచ్చాడు. అభూతకల్పనలతో జగనన్నను విమర్శిస్తున్న చంద్రబాబు, ఆయన బృందాన్ని మించిన మోసకారి ముఠా ఇంకొకటి ఉండదు. జగనన్నే మన నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆయన్ను గెలిపించుకుందాం. మనకు మరింత మేలు జరిగేలా చూసుకుందాం అని పిలుపునిచ్చారు.