పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ కొమ్మెర వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ వంకాయల రమేష్ గురువారం ప్రారంభించారు. చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. రైతులు రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాప్ చేయించుకోవాలని తరువాత పత్తి అమ్మకం జరపాలన్నారు.