వైయస్ఆర్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర లో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ...సామాజిక సాధికారత గురించి మా కంటే ప్రజలకే ఎక్కువ తెలుసు. 2014లో మాయమాటలు నమ్మి, చంద్రబాబును గెలిపించారు. తర్వాత ఎంత మోసపోయారో అందరికీ అర్థమయింది. 2019లో జగనన్నకు కనివిని ఎరుగని రీతిలో పట్టం కట్టారు ప్రజలు. ఈసారి వారు మోసపోలేదు. ప్రజాపాలన అంటే ఏమిటో.. ప్రజానాయకుడు అంటే ఏమిటో చూస్తున్నారు. తనను తాను ప్రజాసేవకుడిగా చెప్పుకుంటూ, సంక్షేమపథకాలు అందిస్తున్న మహానేత తనయుడు జగనన్న. మన అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా చేయూతనందించడంతో పాటు,మహిళా సాధికారతకోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మన బాధలు తెలిసిన వ్యక్తి. మన గుండె తడి తెలిసిన వ్యక్తి. జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతిరహితపాలన, నిజాయితీలతో పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చాలని తపిస్తూ...ఇప్పటికే 99శాతం హామీలను నెరవేర్చిన అసలు సిసలు ప్రజానాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. మనల్ని ఓటుబ్యాంకులుగానే వాడుకున్నవారికి బుద్దిచెప్పి తీరాల్సిందే అని అన్నారు.