ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘కమ్మ సామాజికవర్గ ప్రజలకు విజ్ఞప్తి’ అంటూ వెలుగులోకి ఫేక్ లెటర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 09, 2023, 03:34 PM

నేడు  సీఐడీ చీఫ్ సంజయ్‍ను టీడీపీ బృందం కలవనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు పేరు మీద ప్రచారంలో ఉన్న ఫేక్‍ లెటర్‌పై టీడీపీ బృందం ఫిర్యాదు చేయనుంది. ఈ రోజు ఉదయం సీఐడీ చీఫ్‌ను టీడీపీ బృందం అపాయింట్‍మెంట్ కోరింది. అయితే ఇప్పటికీ ఆయన అపాయింమెంట్ ఖరారు కాలేదు. దీంతో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అపాయింట్‍మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘కమ్మ సామాజికవర్గ ప్రజలకు విజ్ఞప్తి’ అంటూ.. చంద్రబాబు పేరుతో ఓ ఫేక్ లెటర్‌ను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఈ తరుణంలో ఇలాంటి లేఖ వైరల్ కావడంపై టీడీపీ మండిపడుతోంది. ఇలాంటి లేఖలను నమ్మవద్దని.. టీడీపీ ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com