ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం కనుసన్నలలో రాష్ట్ర పార్టీలు నడుస్తున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 09, 2023, 03:34 PM

డబుల్ ఇంజిన్ ఉన్న మణిపూర్‌లో పరిస్థితి ఎలా ఉందో మనం చూసి కేంద్ర ప్రభుత్వం వైఖరిని మనం అర్ధం చేసుకోవాలని  ఏపీసీసీ నేత తులసి రెడ్డి కోరారు. నేడు అయన మీడియాతో మాట్లాడుతూ... రాయలసీమకు పంగనామాలు, రైల్వే జోన్, పోలవరం లేదన్నారు. ఆఖరికి కృష్ణా జలాల పంపిణీలో కూడా మనకు అన్యాయం జరిగిందని తులసిరెడ్డి పేర్కొన్నారు. ఇక చివరకు మనకు తాగునీరుకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రాంతీయ పార్టీ అధినేతలు ముగ్గురూ రాష్ట్రానికి ద్రోహం చేస్తుంటే భజనలు చేస్తున్నారని తులసిరెడ్డి విమర్శించారు. కీలుబొమ్మ పార్టీలతో రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందని ప్రశ్నించారు. కరువు ఇంతలా వచ్చి ఉంటే వైసీపీ నేతలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేసినా.. వైసీపీ అధినేత జగన్‌కు.. అలాగే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఓటేసినా.. మోదీకి ఓటేసినట్టేనని పేర్కొన్నారు. వీరికి ఓటేస్తే మన చెప్పుతో మనం కొట్టుకున్నట్టేనని తులసిరెడ్డి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com