ఉక్రెయిన్ మహిళ ఎసీమాగా తనను తాను పరిచయం చేసుకున్న నిందితురాలు ముంబైలో ఓ ప్రైవేట్ కంపెనీ యజమానిని ఈమెయిల్‌లో సంప్రదించి, భారత్‌లో తాను వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నానని నమ్మబలికింది. రూ.8కోట్లతో కూడిన పార్సిల్‌ను పంపుతున్నట్టు చెప్పి, వ్యాపారిని నిండా ముంచింది. దీంతో ఎసీమా సూచించిన విధంగా భారత్‌కు చెందిన 101 వేర్వేరు ఖాతాలకు బాధితుడు రూ.3.3 కోట్ల నగదు ట్రాన్స్‌ఫర్ చేశాడు. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.