కేరళ రాష్ట్ర సచివాలయం , అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు నవంబర్ 9, 2023న గురువారం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లో పేలుడు పదార్థాలను పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం. వెంటనే స్పందించిన పోలీసు సిబ్బంది, స్నిఫర్ డాగ్స్ తో సచివాలయం ఆవరణలో, వెలుపల క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. అది ఫేక్ కాల్ అని పోలీసులకు తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.