మనం బైక్ మీద లేదా బస్సు లో వెళ్తున్నప్పుడు హైవే రోడ్డు పక్కన ఉన్న చెట్లకు, మొక్కలకు కింది నుంచి కాండం వరకు సున్నం పూసి ఉంటుంది. అలా ఎందుకు పూస్తారో మీకు ఎప్పుడైన డౌట్ వచ్చిందా ! ఎందుకు పూస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సున్నం రాత్రిపూట మార్గనిర్దేశం చేసే పనిని చేస్తుంది. వీధి దీపాలు లేని చోట్ల చెట్లు, మొక్కలకు సున్నం పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాల లైట్లు పడిన వెంటనే పరావర్తనం చెందుతాయి. దీంతో రాత్రి వేళల్లో డ్రైవర్‌కు రూట్‌ను సులభంగా చూసుకోవచ్చు.