ఢిల్లీలో వాయు కాలుష్యం రోజరోజుకు తీవ్రంగా పెరుగుతోంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపడుతున్నా కాలుష్యాన్ని కట్టడి చేయలేక పోతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తాజాగా భారత్‌లో కమ్ముకున్న పొగమంచు ఫోటోలను అంతరిక్షం నుంచి తీసి విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో భారీగా పొగమంచు ఆవరించి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.