మధ్యప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. "మధ్యప్రదేశ్ అభివృద్ధికి కాంగ్రెస్ వద్ద రోడ్ మ్యాప్ లేదని, మోదీ హామీలపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే ఉచిత రేషన్, ఉచిత వైద్యం ఆగిపోతాయని తెలిపారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన చాలా రోజుల పాటు విధ్వంసకర పాలన సాగిందని మోదీ విమర్శించారు.