విశాఖ వాల్తేర్ డివిజన్‌కు అక్టోబరులో టికెట్ల తనిఖీల రూపంలో రికార్డు స్థాయి ఆదాయం వచ్చిందని సీనియర్ డీసీఎం ఎ. కె. త్రిపాఠి బుధవారం తెలిపారు. అక్టోబర్‌లో 49, 966 కేసులు నమోదు చేయగా, రూ. 2. 50కోట్లు అపరాధ రుసుంగా వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు. టికెట్ లేకుండా, అనధికారికంగా, సరైన టికెట్ లేకుండా రిజర్వుడ్ బోగీల్లో ప్రయాణించే వారిపై ఈ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.