భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న 44 మంది వలసదారులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. బీఎస్ఎఫ్ బలగాలు, ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి 8 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 55 చోట్ల దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 5 అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా ముఠాల గుట్టును రట్టు చేశారు. వాటి ద్వారా లభించిన సమాచారంతో అక్రమ వలసదారులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.