ఢిల్లీ-నోయిడాలోని పలు ప్రాంతాల్లో రాత్రిపూట వర్షం కురవడంతో గురువారం ఢిల్లీకి కొంత ఉపశమనం లభించింది. వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలో తగ్గుదల నమోదైంది. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఏసీఐ స్థాయి 400 నుంచి 100కి పడిపోయిందన్నారు. బవానా, కంజ్వాలా, ముండకా, జఫర్పూర్, నోయిడా, గ్రేటర్ నోయిడాలో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాలుష్యం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.