దేశ రాజధాని వాయి కాలుష్యాన్ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. రెండు దశల్లో చేపట్టనున్న ఈ ప్రయోగాత్మక అధ్యయనానికి రూ.13 కోట్లు ఖర్చు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, సుప్రీంకోర్టులో విచారణకు ముందు అఫిడవిట్ ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపించే ప్రతిపాదనను సమర్పించాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఆదేశించారు.