నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్ విమానాశ్రయాల్లో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. నవంబర్ 30 వరకు తాత్కాలిక సందర్శకుల ప్రవేశ పాస్‌లను జారీ చేయవద్దని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశించినట్లు తెలుస్తోంది.