చక్రాయపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గండి క్షేత్రన్ని శుక్రవారం ఉదయం కమలాపురం శాసనసభ్యులు పి. రవీంద్రనాథ్ రెడ్డి శ్రీ ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు మర్యాదలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.