అయినవిల్లి మండలం కొండుకుదురు సచివాలయం పరిదిలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. కొండకుదురు గ్రామ సచివాలయం ప్రక్కన అబ్బి రెడ్డి సుబ్రమణ్యం కుటుంబానికి చెందిన తాటాకిళ్లు ఉదయం 9 గంటలకు అగ్నికి ఆహుతి అయ్యింది. స్థానికులు సమాచారంతో ముమ్మిడివరం ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు మూడు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని స్థానికులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa