ఏపీలో రానున్న ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ నేతలపై వైసీపీ దాడులు చేస్తుందని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ మండిపడ్డారు. భీమవరంలో మునిరత్నంపై దాడిపై ఆయన స్పందిస్తూ.. వైసీపీ ఫ్యాక్షన్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వ్యాఖ్యానించారు. మునిరత్నం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అతని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.