మలికిపురం మండలం రామరాజులంక నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ, ప్రతి పౌరుడికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా చేకూర్చిన మేలును వివరిస్తూ రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం "ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నాలుగున్నర ఏళ్లలో పరిపాలనా సంస్కరణలు, వినూత్న కార్యక్రమాల ద్వారా దేశమంతా మన వైపు చూస్తోందన్నారు.