డిసెంబర్ 15వ తేదీ నుండి అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షూ శుక్లా శుక్రవారం తెలిపారు. ఈ మేరకు క్రీడా పోటీల నిర్వహణపై అమరావతి నుండి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు అమలాపురంలోని కలెక్టరేట్ నుండి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించిన విషయాలపై కలెక్టర్ చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa