స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలను శనివారం పెనుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే శంకర్ నారాయణ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి ఎమ్మెల్యే శంకర్ నారాయణ పుష్పాంజలి ఘంటించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు, కౌన్సిలర్స్, తదితరులు పాల్గొన్నారు.