వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర మన్యం సీమలో కొనసాగింది. పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గంలో సాధికార బస్సు యాత్ర వైభవంగా కొనసాగింది. నియోజకవర్గంలో నాలుగన్నరేళ్లలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పరిశీలించారు. డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అలజంగి జోగారవు, పాముల పుష్ప శ్రీ వాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు స్వాగత నినాదాల హోరు మధ్య బస్సుయాత్ర చేరుకుంది.