భారతీయ విద్యా సాంకేతిక అభివృద్ధికి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ తొలి విద్యాశాఖామంత్రిగా ఎనలేని కృషి చేశారని ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ వహాబ్, సెట్ శ్రీ సీఈవో ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో శనివారం భారతరత్న మౌలానా అబుల్ కలాం అజాద్ 135వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ బాటలో మౌలానా నడిచారన్నారు.