వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ...... మా జెండా కట్టాలి, మా రంగుచొక్కా ధరించాలి. మాకే ఓటు వేయాలని బెదిరించి గతంలో చంద్రబాబులాంటి వారు అణగారిన వర్గాలను అణిచివేశారు. చంద్రబాబు పరిపాలనలో కరవు,అరాచకం,దౌర్జన్యాలు,దోపిడీలు రాజ్యమేలాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగున్నరేళ్లుగా కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను సామాన్యులకు లబ్ధి చేకూరేలా దేశంలో మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని వివరించారు. పేదల కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తూ విద్యా, వైద్యం పరంగా ఉచితంగా సేవలు అందిస్తూ , ఉండటానికి ఇల్లు ఇస్తుంటే దుర్వినియోగం చేస్తున్నామని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. పార్వతీపురం చుట్టూ అనేక ఉద్యమాలు పుట్టాయని, సమాజంలోని అసమానతల కారణంగా పోరాటాలు వచ్చాయన్నారు. ఇప్పుడు జగన్ పాలన కారణంగా ఎటువంటి ఆందోళనలు చేయకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నారని గుర్తు చేసారు. రాష్ట్రంలో 32 లక్షల మందికి 12,800 కోట్లతో భూమి కొనుగోలు చేసి సొంతింటి కలను జగన్ నెరవేరుస్తున్నారని, గతంలో పాలకులు ఎవరైనా సరే ప్రజలకు సొంత గూడు కల్పించాలన్న ఆలోచన చేసారా అని ధర్మాన ప్రశ్నించారు. నిరుత్సాహం, నిస్పృహతో అల్లాడుతున్న ప్రజల కోసం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో గతంలో విద్య ప్రైవేటు పరమైపోయిందని, ఎవరు కోరుకోకుండా ఎందుకు ప్రైవేటు విద్య వచ్చిందని ప్రశ్నించారు. విద్య, ధనవంతులకు మాత్రమే పరిమితమైన పరిస్థితుల్లో పేదలకు ఉన్నత విద్య అందించేందుకు పాఠశాల స్థాయి నుంచి యూనివర్శిటీల వరకు సీఎం జగన్ సంస్కరణలు చేపట్టారని గుర్తు చేసారు. ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను పేదల కోసం జగన్ తీర్చిదిద్దారన్నారు. స్వర్గీయ వైఎస్ ఆర్ , జగన్ ఎప్పుడూ కూడా పేదలు, రైతుల కోసం ఆలోచన చేసి సంక్షేమ పథకాలు అమలు చేయగా, చంద్రబాబు మాత్రం ఎప్పుడూ సంపన్నులు, ధనవంతుల కోసం పని చేస్తుంటారని విమర్శించాారు. పార్వతీపురం ప్రాంతానికి చంద్రబాబు అధికారంలో ఉండగా గత ఐదేళ్లలో ఏమి అభివృద్ధి చేసారో చెప్పాలని ధర్మాన డిమాండ్ చేసారు.