వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలను పట్టించుకున్న దాఖలాలు లేవు. విద్య , వైద్యం, పౌష్టికాహారం అందేది కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ప్రేమించే నాయకుడు వైయస్ జగనన్న. నేడు ప్రభుత్వ స్కూళ్లను నాడు– నేడు కింద కార్పోరేట్ స్కూల్స్ కంటే మెరుగ్గా తీర్చిదిద్దారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో పేదల పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివే అవకాశం కల్పించారు జగనన్న. వాలంటీర్ వ్యవస్థ పెట్టి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్న జగనన్న లాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. మన పిల్లలను మనం చదివించుకోవాలి. కానీ చదివించే బాధ్యత ఈ రోజున మేనమామగా జగనన్న తీసుకున్నాడు. ఇది పేదలకు అందిన వరం కాదా?! ఆనాడు వైయస్ రాజశేఖర్‌రెడ్డి మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు జగనన్న నాలుగు అడుగులు ముందుకేసి మైనార్టీలకు మంత్రి పదవులు, ఉపముఖ్యమంత్రి, పలు సంస్థలకు చైర్మన్లుగా పదవులు ఇచ్చారు.