వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైయస్ జగన్మోహన్రెడ్డి సామాజిక విప్లవానికి నాంది పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల స్థితిగతులు పెరగడానికి, వారి కుటుంబాలు బాగుండడానికి అవకాశాలు కల్పిస్తున్న జగనన్న. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో పేదల కుటుంబాల వారికి అందుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కకడా లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేసిన వ్యక్తి, దగాకోరు చంద్రబాబు. చంద్రబాబు దళితుల మీద దాడులు చేయించాడు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. బీసీలు జడ్జిలుగా పనికి రారు అన్నాడు. కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న పాలన జగనన్న చేస్తున్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్ర వర్ణాల్లోని పేదలకు, ఈ నాలుగున్నరేళ్లలో, నేరుగా రూ 2.35 లక్షల కోట్లు అందజేసిన సంక్షేమ సారథి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి. ఇందులో రూ.1.76 లక్షల కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా అందాయి అని తెలియజేసారు.