వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ... ఇప్పుడు ఎవరి దగ్గరకు వెళ్లి దేహీ అని అడగాల్సిన పని లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇంటికే ఇస్తున్న పరిస్థితి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలనూ నిలబెడతామని బీసీ గర్జనలో చెప్పాం. రాజ్యసభ సభ్యులుగా బిజినెస్‌మెన్లకే కాదు, నలుగురు బీసీలకు అవకాశం ఇచ్చిన జగనన్న. మంత్రులు ఎస్సీలు, బీసీలు, ఎస్టీలకు వెతికి వెతికి ఇచ్చిన జగనన్న. నాడు–నేడు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తెచ్చి సమూలంగా విద్యావ్యవస్థను బాగు చేశారు. నాలుగున్నరేళ్లలో మా పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం. వరికపూడిశెల ప్రాజెక్టు ఈనెల 17న సీఎం గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నాం. రూ.3 వేల కోట్లతో రహదారులు శాంక్షన్ చేయించుకున్నాం. 3 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చుకున్నాం అని తెలియజేసారు.