వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా సినీ నటుడు ఆలీ మాట్లాడుతూ.... పల్నాడు ఏరియాలో మన ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు ఉన్నారు, వాళ్ల కోసం వెళ్లాలి అని జగనన్న నాకు చెప్పారు. జూలకటక అనే సినిమా షూటింగ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. గొప్పవాళ్లు మాట్లాడటాన్ని చూసి 6 భాషలు నేర్చుకున్నా. మన పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? ప్రపంచం మారాలి, మన పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలనేది జగనన్న ఆలోచన. వైయస్సార్ గారు ఉన్నప్పుడు మా నటుల్లో ఒకరికి బాగోలేకపోతే వెళ్లాను. గవర్నమెంట్ తరఫున సాయం చేయాలని కోరాం. 15 సంవత్సరాల కిందటే రూ.5 లక్షలు ఇచ్చారు. ఆ వ్యక్తి కళాకారుడు అని చూశారు. దటీజ్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. మళ్లీ అదే దారిలో నడుస్తున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. జగనన్న మాట ఇస్తే తప్పడు. మడమ తిప్పడు. నాలుగు రోజుల కిందట 11 వేల మంది పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల కష్టాలు పాదయాత్రలో చూసి నవరత్నాల ద్వారా సమస్యలు తీర్చిన జగనన్న. పెదకూరపాడులో 20 షాదీఖానాలు కట్టించిన నంబూరు శంకర్‌రావుకు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ధన్యవాదాలు అని తెలిపారు.