వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.... ఇంతకు ముందు బడ్జెట్ రూ.100 ఉంటే ఇన్నేళ్లలో ఆ వందలో కనీసం 10 రూపాయలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఖర్చు చేయలేదు. జగనన్న నాలుగున్నరేళ్లలో రూ.5 లక్షల కోట్లు కేవలం పేద ప్రజల కోసం, చదువులు, తల్లుల ఆర్థిక సాధికారత కోసం వెచ్చించారు. 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. రాజకీయ సామాజిక సాధికారత కల్పించి బడ్జెట్‌లో 50 శాతం నిధులు పేదవారికి ఖర్చు పెడుతున్న జగనన్న. ఇంతకు ముందు వేదికలపై రాయపాటి సాంబశివరావు, హనుమయ్య, కోటేశ్వరరావు లాంటి వారే కూర్చొనేవారు. ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కూర్చుంటున్నారు అని అన్నారు.