వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ..... సామాజిక సాధికార యాత్రలో జనవర్షం కురుస్తోంది. మహిషాసురుని సంహరిస్తే దసరా చేసుకుంటున్నాం. నరకాసురున్ని సంహరిస్తే దీపావళి చేసుకుంటున్నాం. తరతరాలుగా బడుగు, బలహీన వర్గాల అణచివేతను సంహరిస్తే, ఆ ప్రభుత్వ పాలనను ఏమనాలి? ఆ ఉత్సవాలే ఈ సామాజిక సాధికారత. జగనన్నది పేదల ప్రభుత్వం. బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం. బడుగు, బలహీన వర్గాలు సామాజిక సాధికారత సాధించాలంటే సామాజికంగా ఆర్థికంగా బడుగు బలహీనవర్గాలు ఎదిగినప్పుడే సాధ్యమవుతుంది. నాలుగున్నరేళ్ల పాలనలో సాధికారత సాధించేందుకు విద్య, వైద్యంలో జగనన్న విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత చదువులు చదవడం వల్ల ప్రతి కుటుంబంలో ఒక ఇంజనీరు, డాక్టరు, లాయరు తయారవుతారు. ఆ కుటుంబం తలరాతలు మారుతాయి. పిల్లలు చదువుకొనేందుకు జగనన్న అమ్మ ఒడి తెచ్చారు. జగనన్న గోరుముద్ద అందిస్తున్నారు. వసతి దీవెన, విదేశీ విద్యా దీవెనతో జగనన్న ప్రభుత్వం అండగా ఉంటోంది. చదువుల ఒరవడి, విద్యా విప్లవం చూస్తున్నాం. చంద్రబాబు హయాంలో 1059 ఉన్న ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 3,257కు పెంచి పేదలను ఆదుకున్న దేవుడిగా నిలిచిన జగనన్న. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చేయని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం తెచ్చారు. రోగి కోలుకొనే సమయంలో రూ.5 వేల వరకు ఆరోగ్య ఆసరా ఇస్తున్న జగనన్న. 17 మెడికల్ కాలేజీలతో కలలను సాకారం చేస్తున్నారు. ఇప్పటికే ఐదింటిని ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో స్కూళ్లు బాగు చేయాలని, మంచి భోజనం ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. మిడ్ డే మీల్స్‌లోనూ దోచుకున్నారు. ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీనీ తీసుకురాలేదు. మన బీసీలు, మన ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను జగనన్న నాలుగు దిక్కులు అనుకున్నాడు అని తెలియజేసారు.