ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లికి బిచ్చం వేయని చంద్రబాబు అమ్మకు వందనం ఇస్తానంటున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 11, 2023, 12:21 PM

వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ... జగనన్న  మన బిడ్డలకు మేనమామగా చదివిస్తున్నాడు. అవ్వాతాతలకు మనవడిగా నెల మొదటి రోజునే ఫించన్లు అందేలా చేశారు. అదీ ఇంటి గడప దగ్గరకే వచ్చి ఇచ్చేలా చేశాడు. జగనన్న ఎస్సీలకు అంబేద్కర్‌లాంటి వాడు, బోయలకు వాల్మీకి మహర్షి లాంటి వాడు. వైయస్‌ జగనన్న పార్టీ పెట్టకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇన్నేసి పదవులు వచ్చేవా?  జగనన్న అమ్మఒడి ఇస్తుంటే... పిల్లికి బిచ్చం వేయని చంద్రబాబు అమ్మకు వందనం ఇస్తానంటున్నాడు. మళ్లీ మెల్లగా తన తప్పుడు హామీలను వదులుతున్నాడు. నీమాటలకు మేము మోసపోము బాబు అని ప్రజలు గట్టిగా చెప్పాలి అని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com