వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ...... సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. గత ప్రభుత్వాల పాలనలో వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రజలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. టీడీపీ నేత చంద్రబాబు కు నిజాయితీ, దూరదృష్టి అంటూ ప్రచారం చేసుకుంటున్నారని, దూరదృష్టి అంటే బాబు తనయుడు లోకేశ్ ఎలా సీఎం చేసుకుందామా అన్నదేనని ఎద్దేవా చేసారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ప్రకటించిన మ్యానిఫెస్టోనే తీసేసిన పార్టీకి నిజాయితీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. నిజాయితీ, దూరదృష్టి అంటే జగనే అని, రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అత్యున్నత స్థానం కల్పించడం, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు తేవడం, గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం దూరదృష్టి అని కొనియాడారు.