ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ సర్కార్‌కు మరో తలనొప్పి,,,,తక్కువధర భూమిని ఎక్కువధరకు అమ్మినట్లు ఫిర్యాదు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 11, 2023, 10:03 PM

ఢిల్లీ ప్రభుత్వం చుట్టూ కేసులు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసు ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న వేళ.. తాజాగా మరో కొత్త కేసు బయటికి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్ తీవ్ర అవినీతికి పాల్పడినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయానికి తాజాగా ఫిర్యాదు అందింది. సీఎంఓతోపాటు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ మంత్రి అతిషికి కూడా ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. భూమి ధరను అమాంతం పెంచి రూ.312 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఢిల్లీ సీఎస్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.


రూ.41 కోట్ల విలువైన భూమి ధరను రూ.353 కోట్లకు పెంచి అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదు దారుడు ఒక లాయర్ అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ కంపెనీ ఢిల్లీ సీఎస్‌ నరేశ్‌కుమార్‌ కుమారుడు పని చేస్తున్న సంస్థతో సంబంధం ఉన్న కంపెనీ అని తెలిపారు. దీంతో ఈ వ్యవహారంలో మొత్తం రూ.312 కోట్ల మేర అవినీతి జరిగిందని వచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తి స్థాయి నివేదిక కోరింది. అయితే ఈ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ సీఎస్ నరేశ్‌ కుమార్‌ తీవ్రంగా ఖండించారు. అసలు ఆ సంస్థ గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు. ముందుగా ఈ కేసులో తానే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.


2018లో ద్వారక ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కోసం ఢిల్లీ శివారులోని 19 ఎకరాల భూమిని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా-ఎన్‌హెచ్‌ఏఐ కొనుగోలు చేసింది. అయితే ఆ 19 ఎకరాల భూమి విలువ రూ.41.52 కోట్లు అని అప్పటి నైరుతి ఢిల్లీ జిల్లా అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ఆ భూమి విలువను నైరుతి ఢిల్లీ జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కుమార్ రూ.353.79 కోట్లకు పెంచినట్లు తెలిసింది. దీంతో ఆ జిల్లా కలెక్టర్ హేమంత్ కుమార్ అతడ్ని సస్పెండ్‌ చేశారు. అనంతరం ఆ ఉత్తర్వులను కూడా పక్కకు పెట్టేశారు.


ఈ వ్యవహారంలో భూములు విక్రయించిన వారికి ఎన్‌హెచ్‌ఏఐ అధిక ధరలు చెల్లించేలా ఢిల్లీ సీఎస్ నరేశ్ కుమార్ ‌సమక్షంలోనే ఉత్తర్వులు విడుదల అయ్యాయని ఫిర్యాదుదారుడు ఆరోపించినట్లు తెలుస్తోంది. అయితే భూ యజమాని సుభాష్‌ చంద్‌ కథురియాకు అనంత్‌ రాజ్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ప్రమోటర్ అయిన అమన్‌ సరిన్‌తో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమన్ సరిన్‌కు.. ఢిల్లీ సీఎస్ నరేశ్ కుమార్ కుమారుడు కరణ్‌కు కూడా మంచి సంబంధాలు ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు. అయితే బిగ్‌ టౌన్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు కరణ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారుు. అయితే అనంత్‌రాజ్‌ లిమిటెడ్‌ సంస్థకు కూడా అదే అడ్రస్‌, ఈ-మెయిల్‌ ఉన్నట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించారు. మరోవైపు.. ఈ విషయం ఈ ఏడాది జూన్‌లోనే సీఎస్ నరేశ్‌కుమార్‌ దృష్టికి వచ్చిందని.. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆయన ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్‌ విజిలెన్స్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa